భారతదేశం, ఫిబ్రవరి 11 -- Ponnam Prabhakar: కరీంనగర్‌లో జరిగిన వేంకటేశ్వర స్వామి శోభాయాత్రలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కోలాటం ఆడి చూపరులను కనువిందు చేశారు.

కరీంనగర్ లోని ప్రధాన కూరగాయల మార్కెట్ లో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా జరిగాయి. ఈనెల మూడు నుంచి పదో తారీఖు వరకు వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పద్మనగర్ నుండి మార్కెట్ రోడ్ లో గల వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు.

శోభ యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దారి పొడవున భక్తులు శ్రీవారిని ...