భారతదేశం, మార్చి 24 -- Ponnam Prabhakar: తెలంగాణలో నూతన స్క్రాప్ పాలసీ తీసుకొచ్చి 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ కింద తీసుకుని రాయితీ పై కొత్త వాహనం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ కు 100 శాతం టాక్స్ మినహాయింపు తెలంగాణలోనే ఇస్తున్నామని స్పష్టం చేశారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖుస్థాపన చేశారు. జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్క్ ను ప్రారంభించారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం, డిటిసి పురుషోత్తంతో కలిసి హెల్మెట్ ల పంపిణీ చేశారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పై పిల్లలకు అవగాహన కల్పిచారు. విద్యార్థి దశలో...