భారతదేశం, మార్చి 18 -- Ponman Review: సూక్ష్మ‌ద‌ర్శిని ఫేమ్ బాసిల్ జోసెఫ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ పొన్‌మాన్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డ్రామా థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. జోతిష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓటీటీలో తెలుగులో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

అజేష్ (బాసిల్ జోసెఫ్‌) బంగారం సేల్స్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంటాడు. పెళ్లిళ్ల‌కు అవ‌స‌ర‌మైన బంగారాన్ని ముందుగా స‌ర్ధుబాటు చేస్తుంటాడు. పెళ్లిళ్ల‌లో చ‌దివింపుల ద్వారా బంగారానికి స‌రిప‌డా వ‌చ్చే డ‌బ్బు తీసుకోవ‌డ‌మే అత‌డి వృత్తి. రిస్క్ ఎక్కువే ఉన్నా కుటుంబ‌ప‌రిస్థితుల కార‌ణంగా జాబ్‌లో కొన‌సాగుతుంటాడు.

బ్రూనో ఓ పొలిటిక‌ల్ పార్టీ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తుంటాడు. చెల్లి స్టెఫీ (లిజోమోల్ జోస్‌) పెళ్లి కోసం అజేష్ ద‌గ్గ‌ర ...