Hyderabad, మార్చి 22 -- దానిమ్మ పండు ఏ సీజన్లోనైనా దొరుకుతుంది. దీన్ని శక్తివంతమైన ఆహారంగా చెప్పుకుంటారు. దీని ఎరుపు గింజలు మనలో ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి. పైగా ఇది ఎంతో శక్తివంతమైన పోషకాలు కలిగిన పండు కూడా. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ నిండి ఉంటుంది. మీ ఆరోగ్యానికి ఇదొక గేమ్ ఛేంజర్ కూడా కావచ్చు. ప్రతిరోజూ ఒక దానిమ్మ పండును తిని చూడండి. నెల రోజుల్లో మీ శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీకే అర్థమవుతుంది. దానిమ్మ పండు రోజూ ఒకటి తినడం వల్ల మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవిగో.

దానిమ్మ పండులో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హై బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ధమను...