భారతదేశం, నవంబర్ 18 -- కార్తీకమాసంలో శివ-కేశవలను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీకమాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు, అంటే పాడ్యమినాడు, పోలి పాడ్యమిని జరుపుతారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. పోలి పాడ్యమి నాడు మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు, నదుల్లో దీపాలను వదులుతారు. ఆ రోజున ముఖ్యంగా పోలి కథను చదువుకోవాలి.

ఈసారి పోలి పాడ్యమి నవంబర్ 21, శుక్రవారం నాడు వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే, కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలి పాడ్యమిని జరుపుకోవాలని పేర్కొన్నారు. సూర్యోదయంతో పాటు తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమిని చేస్తారు.

పోలి పాడ్యమి నాడు దీప దానం చేయడం, నదులు, చెరువుల్లో దీపాలను వదలడం వంటివి చేస్తారు. పోలి పాడ్యమి నాడు పోలి బొందితో స...