భారతదేశం, నవంబర్ 21 -- ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. ఈ ఏడాది పోలి నవంబర్ 21, అంటే ఈరోజు వచ్చింది. పోలి పాడ్యమి నాడు దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. శివ-కేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే పోలి పాడ్యమి నాడు ఈ విధంగా ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

పోలి పాడ్యమి చాలా విశేషమైనది. కార్తీక మాసం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. పోలి పాడ్యమి నాడు దీపాలను వెలిగించి ప్రవహించే నదుల్లో వదలాలి. కుదిరితే 31 దీపాలు లేదా ఒత్తులను వెలిగించి వదలడం మంచిది.

ఈ ముఖ్యమైన రోజున ఏమాత్రం వదులుకోవద్దు. పోలి పాడ్యమిని "పోలి స్వర్గం" అని కూడా అంటారు. ఈరోజు ప...