భారతదేశం, జనవరి 28 -- Polavaram Left canal: 2025 ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించేలా ఏజెన్సీలు, అధికారులు పనులు చేపట్టాలని ఆదేశించామని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిపై ఆయా శాఖాధికారులతో విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ. 1050 కోట్లతో ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి లెఫ్ట్ కెనాల్ పూర్తిచేసి, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకెళ్ళాలనే హామీని నెరవేర్చుతామన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యకు ముగింపు లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల ప...