భారతదేశం, మార్చి 28 -- Polavaram: గోదావరి పుష్కరాలు మొదలయ్యేలోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రాజెక్టు పురోగతిని పరిశీలించిన చంద్రబాబు పునరావాస చర్యల్ని సమీక్షించారు. 207 ఫిబ్రవరికల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2019లో ప్రభుత్వం మారడంతో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో అంతా చూశారని, డయాఫ్రం వాల్‌ను దెబ్బతీశారని కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేసి ఉంటే డయాఫ్రం వాల్ దెబ్బ తినేది కాదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పరిస్థితిని అధ్యయనం చేయడానికి విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారని చంద్రబాబు చెప్పారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని సూచించడంతో మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సి వచ్చిందన్నారు. అంతకు ముందు ఖర్చు పెట్టిన రూ.440 కోట్లు ...