తెలంగాణ,హైదరాబాద్, మార్చి 21 -- BRS Leader Booked For Social Media Post: : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానందరెడ్డి అంటూ ఓ అంశంపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసిన బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేత మన్నె క్రిశాంక్(Manne Krishank) పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యీ మహేశ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిశాంక్ పై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు క్రిశాంక్ మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు.

ఈ కేసుపై మన్నె క్రిశాంక్ స్పందిస్తూ. "టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు రూ. 3000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల రేవంత్‌ సోదరుడు అనుముల మహానందరెడ్డిపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు ఇందిరమ్మ పోలీసులు నా మొబైల్‌ను స్వాధీనం చేసుకుని కే...