భారతదేశం, ఏప్రిల్ 8 -- పోకో తన బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ పోకో సీ71ను గత వారం భారత్‌లో లాంచ్ చేసింది. 6.88 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే, యూనిసోక్ టీ7250 ప్రాసెసర్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పోకో సీ71 ఫోన్ తొలి సేల్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మొదటి సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.

ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించడం ద్వారా నేరుగా పోకో సీ71ను కొనుగోలు చేయవచ్చు. ఇక ధర విషయానికొస్తే పోకో సీ71.. 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6499. కూల్ బ్లూ, డెసర్ట్ గోల్డ్, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పోకో సీ71.. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఫోన్‌ను రూ.7,499కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్...