భారతదేశం, ఫిబ్రవరి 3 -- PM SVANidhi Scheme : కోవిడ్ మహమ్మారి సమయంలో చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు చితికిపోయారు. చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏ విధమైన గ్యారంటీ లేకుండా చిరు వ్యాపారులకు రుణం అందిస్తారు. మొదట్లో ఈ పథకం కింద 10 వేల రూపాయల రుణం అందించేవారు. ఈ స్కీమ్ లో అత్యధికంగా రూ.50 వేల వరకు రుణాన్ని ఇస్తారు.

కేవలం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు రుణం పొందవచ్చు. తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. స్వనిధి పథకంలో రుణం పొందేందుకు గ్యారంటీ, ష్యూరిటీ అవసరం లేదు. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సులభమైన వాయిదాలలో చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. తీసుకున...