భారతదేశం, మార్చి 14 -- PM Suryaghar: ఏపీలో పీఎం సూర్యఘర్ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు.

పీఎం సూర్యఘర్‌ లో 2 కిలో వాట్ల సోలార్ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చు అవుతుండగా కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.20 వేలు అదనంగా రాయితీ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం 2 కిలో వాట్ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి రూ.80 వేల వరకు సబ్సిడీ అందనుంది. బీసీ వర్గాలకు అండగా ఉండాలనే తాము ఈ నిర్ణ...