భారతదేశం, జనవరి 28 -- PM Surya Ghar Scheme : ప్రజలపై విద్యుత్ భారం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ ను ప్రోత్సహిస్తుంది. పీఎం సూర్యఘర్ యోజన్ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ ప్యానళ్లను అమర్చుతున్నారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు ఈ పథకం ద్వారా రాయితీలు అందిస్తు్న్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఏపీలో కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ను అమర్చాలని నిర్ణయించింది. తొలి విడతలో లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ ప్యానళ్లను అమర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు సెర్ప్‌ అధికారులు అ...