భారతదేశం, ఫిబ్రవరి 7 -- PM Modi US visit: ఈ నెల 12 నుంచి 13 వరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రస్తుతం అమెరికాలోని భారతీయ విద్యార్థులు, ఇతరులు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భయాందోళనలకు గురవుతున్నారు. భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లినవారిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవలనే భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో అమెరికా విమానం భారత్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన వల్ల యూఎస్ లోని భారతీయుల భయాందోళనలకు ఏమైనా పరిష్కారం లభించనుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు.

''ఈ నెల 12, 13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ ...