భారతదేశం, సెప్టెంబర్ 1 -- పాకిస్థాన్ ప్రధానమంత్రి సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉగ్రవాదంపై బలమైన సందేశం ఇచ్చారు. 25వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో సవాలు కాదని, యావత్ మానవాళికి సవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

చైనా టియాంజిన్​ వేదికగా జరుగుతున్న ఎస్​సీఓ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ.. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించారు. భద్రత, శాంతి, స్థిరత్వం అనేవి అభివృద్ధికి పునాదులని నొక్కి చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎస్‌సీఓ దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

"ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యతకు కట్టుబడి ఉంది. ఇందులో ఎస్‌సీఓకు ముఖ్యమైన పాత్ర ఉంది," అని మోదీ అన్నారు.

ఈ నేపథ్యంలో అల్‌-ఖైదా వంటి ఉగ్రవ...