భారతదేశం, ఏప్రిల్ 14 -- PM Modi On HCU Lands : హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అడవులను ధ్వంసం చేస్తోందని ప్రధాని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల అంశం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ హరియాణా పర్యటనలో స్పందించారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్ బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతిని నాశనం చేయడం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్‌ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్‌ మర్చిపోయిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

"తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. కాంగ్రెస్ సర్కార్ అడవులపై బుల్డోజర్లు పంపడంతో బిజీగా ఉం...