భారతదేశం, ఏప్రిల్ 5 -- PM Modi: శ్రీలంక ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన 'మిత్రవిభూషణ' పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, ఇరు దేశాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శ్రీలంక అధ్యక్షుడి చేతుల మీదుగా శ్రీలంక మిత్ర విభూషణ్ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు.

''ఈ గౌరవం నాది మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారత ప్రజలది. ఇది భారతదేశం మరియు శ్రీలంక ప్రజల మధ్య చారిత్రాత్మక మరియు లోతైన స్నేహానికి నివాళి. ఈ గుర్తింపును అందించిన శ్రీలంక ప్రభుత్వానికి, అధ్యక్షుడు దిస్సానాయకేకు మరియు ఈ దేశ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని ప్రధాన మం...