భారతదేశం, ఫిబ్రవరి 8 -- PM Kusum Scheme : పర్యావరణ సమతుల్యత పాటిస్తూ, రైతులకు ఆదాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 'కుసుమ్' పథకాన్ని అమలు చేస్తోంది. పంట పొలాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒక్కో రైతు కనిష్ఠంగా 0.5 మెగావాట్ల నుంచి గరిష్టంగా 2 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి చేసేలా పథకాన్ని ఉద్దేశించారు. ఆసక్తి కలిగిన రైతులకు బ్యాంకర్ల సహకారంతో రుణం మంజూరు చేయనుండగా విద్యుత్తు ఉపకేంద్రాలకు సమీపంలో భూములున్న వారికి అనుమతులిస్తారు. రైతుల నుంచి టీజీ రెడ్కో సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రైతు క్షేత్రం వద్ద ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా డిస్కంలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మెగావా...