భారతదేశం, ఫిబ్రవరి 21 -- PM Kisan e-Kyc Beneficiary List : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.6 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. 2019 ఫిబ్రవరి 24 తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా 19వ విడత పీఎం కిసాన్ నిధుల జమపై అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమ చేయనున్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ విధానంలో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు 18 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు.

పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరి 24వ తేదీన రైతుల అకౌంట్లలో రూ.2 వేలు జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీహార్ లో భ...