భారతదేశం, మార్చి 11 -- కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్లై చేసుకోవాలనుకుని మరిచిపోయినవారికి గుడ్‌న్యూస్. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 రెండో దశ దరఖాస్తు గడువును పొడిగించారు. మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే.. pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోండి. లేదంటే ఇంటర్న్‌షిప్ స్కీమ్ పొందే సువర్ణావకాశం మీ చేతుల్లోంచి పోతుంది.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో దశలో మొత్తం లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పీఎం ఇంటర్న్‌షిప్ రెండో దశ కోసం మొదట దరఖాస్తుకు చివరి తేదీని 12 మార్చి 2025గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు అభ్యర్థులు 31 మార్చి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1. ముందుగా అభ్యర్థి pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.

2. ఆ తర...