భారతదేశం, మార్చి 31 -- ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ 2025 రెండో దశ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే, pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. లేదంటే ఇంటర్న్‌షిప్ పొందే సువర్ణావకాశం మీ చేతుల్లోంచి పోతుంది. పీఎం ఇంటర్న్‌షిప్ రెండో దశలో మొత్తం లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గతంలో దరఖాస్తుకు చివరి తేదీ 12 మార్చి 2025 కాగా ఆ తర్వాత 2025 మార్చి 31 వరకు పొడిగించారు.

1. ముందుగా అభ్యర్థి pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సై‌ట్‌కు వెళ్లాలి.

2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.

3. దీని తరువాత మీరు మీ మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

4. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్‌తోపాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయ...