Hyderabad, మార్చి 26 -- మొక్కలంటే మీకు చాలా ఇష్టమైతే. మీ ఇంట్లో మీరు ఎన్నో రకాల మొక్కలను పెంచుతుంటే వేసవిలో మీ బాధేంటో మేం అర్థం చేసుకోగలం. వేసవిలో మొక్కలను కాపాడటం చాలా కష్టమని మాకు తెలుసు. ఎందుకంటే ఎండలు పెరుగుతున్నాయి. తీవ్రమైన వేడి, ఎండ, వేడిగా గాలలుతో మనకే ఇన్ని ఇబ్బందులుంటే, మొక్కల సంగతి ఏంటి? ఇవి వాటిని ఎంతగా ప్రభావితం చేస్తాయో! నిజానికి ఎండాకాలం మొక్కలకు సవాలుగా ఉండే కాలం. తీవ్రమైన సూర్యకాంతి వల్ల ఎండిపోవడం, వాడిపోవడం, ఆకులు రాలిపోవడం జరుగుతుంది. కొన్ని సార్లు ప్రాణాలను కోల్పోతుంటాయి. ఇలా జరగుండా ఉండటం కోసం వేసవిలో మొక్కల విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, చిట్కాలను మీకోసం మేం తీసుకొచ్చాం. అవేంటో తెలుసుకోండి. మీకు ఇష్టమైన మొక్కలను జాగ్రత్తగా చూసుకోండి.

వేసవిలో మీరు చేయగలిగే చక్కటి సులభమైన పద్ధతి ఏమిటంటే తీవ్రమైన వేడిని తట్ట...