భారతదేశం, డిసెంబర్ 12 -- Planets Transit: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. గ్రహాల సంచారం బట్టి హఠాత్తుగా అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.

సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్య సంచారం జరిగినప్పుడు కూడా అన్ని రాశుల వారి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. సూర్యుడు ఈ డిసెంబర్ నెలలో ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. నెల రోజుల పాటు సూర్యుడు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మకర సంక్రాంతి నాడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు డిసెంబర్ 16న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు....