భారతదేశం, మార్చి 10 -- Pithapuram SVSN Varma : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీడీపీ ఆదివారం(మార్చి 9) ప్రకటించింది. సీనియర్లను పక్కన పెట్టి మరోసారి యువ నేతలకే స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. ఏపీలో మొత్తం స్థానాలకు ఖాళీలు ఏర్పడగా, పొత్తులో భాగంగా జనసేనకు ఒక సీటు కేటాయించారు. మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని భావించారు. అయితే చివరి నిమిషంలో బీజేపీకి ఒక సీటు కేటాయించారు.

టీడీపీ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడులను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఛాన్స్ దక్కగా, బీజేపీ నుంచి సోము వీర్రాజు పోటీ చేయనున్నారు.

టీడీపీ ను...