భారతదేశం, ఏప్రిల్ 6 -- పిఠాపురం టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చినజగ్గంపేటకు చెందిన తెలుగుదేశం నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తనను దూషించారని టీడీపీ నాయకులపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది.

ఎమ్మెల్సీ నాగబాబు శుక్రవారం, శనివారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు. అటు నాగబాబు పర్యటించిన ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులు పోటీగా నినాదాలు చేశారు. స్వల్ప ఘర్షణ కూడా జరిగింది.

పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరు పార్టీల కార్యకర...