భారతదేశం, ఏప్రిల్ 5 -- పిఠాపురంలో ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరింది. టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్ మరింత ముదిరింది. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఎమ్మెల్సీ నాగబాబు సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసైనికుల పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు.

శుక్రవారం (ఏప్రిల్ 4న) కూడా నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలు దగ్గర సీఎస్ఆర్ ఫండ్స్‌తో హెల్త్ సెంటర్ నిర్మిస్తున్నారు. దానికి నాగబాబు శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా అక్కడ ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై చంద్రబాబు పేరు లేదనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో జనసేన, టీడీపీ కేడర్ మధ్య డైలాగ...