భారతదేశం, నవంబర్ 11 -- ఎడ్‌టెక్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఫిజిక్స్​ వాలా లిమిటెడ్ మంగళవారం (నవంబర్ 11) తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సబ్​స్క్రిప్షన్​ని ప్రారంభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ. 3,400 కోట్లకు పైగా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది సంస్థ. ఈ సంస్థ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే కోర్సులను, ఇతర నైపుణ్యాల పెంపుదల కోర్సులను అందిస్తోంది. ఫిజిక్స్​ వాలా ఐపీఓ పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం నవంబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. మరి ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక్కడ తెలుసుకోండి..

ఫిజిక్స్​ వాలా అలాట్‌మెంట్ తేదీ: నవంబర్ 14న కేటాయింపులు జరగవచ్చు.

ఫిజిక్స్​ వాలా లిస్టింగ్ డేట్​: నవంబర్ 18న స్టాక్ ఎక్స్​ఛేంజీలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫిజిక్స్​ వాలా షేర్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ రెండింటిలోనూ ట్రేడ్ అవుతాయి....