Hyderabad, ఫిబ్రవరి 22 -- ఫూల్ మఖానా ఆధునిక తరంలో సూపర్ ఫుడ్ గా పేరు తెచ్చుకున్న ఆహారం. మొన్న కేంద్ర బడ్జెట్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఫుల్ మఖానా కోసం స్పెషల్‌గా ఒక బోర్డుని ఏర్పాటు చేస్తున్నారంటే అవి ఎంత ఆరోగ్యకరమైనవో తెలుసుకోవాలి. ఇవి ఎలా తయారవుతాయో, ఎందుకంharithaత ఖరీదో ఇక్కడ వివరించాము.

ఫూల్ మఖానా పోషకాలు అధికంగా ఉండే స్నాక్ ఐటమ్. ప్రపంచంలోని ఎంతోమంది వైద్యులు వీటిని తినమని సిఫారసు చేస్తారు. దీంతో అనేక రకాల వంటలు కూడా చేయవచ్చు. ఫూల్ మఖానా తయారీ భిన్నంగా ఉంటుంది. అందుకే దీని ఖరీదు ఎక్కువ.

ఫూల్ మఖానాను యూరియాల్ ఫాక్స్ అని కూడా పిలుస్తారు. మనదేశంలో వీటిని తామర గింజలు అంటారు. నీటిపై పెద్దగా గుండ్రంగా తేలియాడుతూ ఈ తామర మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వీటి ఆకులు పెద్దపెద్దవిగా ఉం...