భారతదేశం, మార్చి 8 -- ఒకప్పుడు ఒక సాధువు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులలో ఒకరు సాధువు దగ్గరికి వస్తాడు. అతను స్వతహాగా కొంచెం కోపిష్టి. అతను సాధువు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.. 'గురూజీ.. మీరు ఎవరిపైనా కోపం తెచ్చుకోకుండా, మంచిగా ఎలా ఉంటున్నారు.. మీ మంచి ప్రవర్తన రహస్యం ఏమిటో దయచేసి మాకు చెప్పండి' అని అడిగాడు.

అప్పుడు సాధువు ఇలా అన్నాడు.. 'నా రహస్యం నాకు తెలియదు. కానీ నీ రహస్యం నాకు కచ్చితంగా తెలుసు' అని అన్నాడు. "నా రహస్యం ఏమిటి స్వామి" ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు. "వచ్చే వారంలోపు నువ్వు చనిపోతావని తెలిస్తే బాధపడతావు" అన్నాడు సాధువు. వేరే ఎవరైనా ఇలా చెప్పి ఉంటే.. శిష్యుడు దానిని హాస్యాస్పదంగా తోసిపుచ్చగలిగేవాడు. కానీ సాధువు నోటి నుండి వచ్చిన దానిని ఎవరైనా ఎలా ఖండిస్తారు.

'శిష్యుడు విచారంగా గురువు ఆశీస్సులు తీసుకున్న తర్వ...