భారతదేశం, ఫిబ్రవరి 12 -- PH Railway Pass: శారీరక వైకల్యం బాధపడే వారికి రైల్వే పాస్‌ జారీలో నిబంధనలు సడలించారు. పాస్‌ కోసం రైల్వే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే రైల్వే పాసులు పొందే వెసులుబాటును ఇండియన్ రైల్వే క‌ల్పించిన‌ట్లు చిత్తూరు జిల్లా రైల్వే శాఖ అధికారి వెంక‌టేష్ తెలిపారు.

ఇంట‌ర్ నెట్ కేంద్రాల్లో లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకునే సౌల‌భ్యం రైల్వే శాఖ క‌ల్పించింది. లేక‌పోతే సొంత కంప్యూట‌ర్ ఉంటే, ఇంటి వ‌ద్ద నుంచే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

రాష్ట్రంలో దివ్యాంగు పెన్ష‌న్లు పొందుతున్న‌వారు 7,87,976 మంది ఉన్నారు. అంటే దాదాపుగా దివ్యాంగులు కూడా అంతే మంది ఉంటారు. వీరు రైల్వే పాస్ పొందేందుకు అర్హులు. వీరంతా ఇప్పుడు రైల్వే కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ఆన్‌లైన్‌లో రైల్వే పాస్ పొందే విధానాన్ని వినియోగించుకోవచ్చ...