భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఉద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్ రానుందని తెలుస్తోంది. పీఎఫ్‌కు సంబంధించిన కొత్త రూల్ వస్తుందని అంటున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తన చందాదారులకు పీఎఫ్ ఉపసంహరణను సులభతరం చేయడానికి పనిచేస్తోంది. త్వరలోనే పీఎఫ్ కస్టమర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చని జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది.

జీపే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వినియోగదారులు తమ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) డబ్బును నేరుగా ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రారంభించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. ఇందుకోసం పీఎఫ్ ఉపసంహరణలను యూపీఐ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేసేందుకు ఈపీఎఫ్ఓ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ...