భారతదేశం, మార్చి 31 -- ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో డబ్బు జమ చేసిన వారికి శుభవార్త. మీరు మీ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే.. ఆ ప్రక్రియకు ఇకపై వారాల సమయం పట్టదు. ఈ ప్రక్రియ కేవలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ కొత్త సౌకర్యం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

మీ డబ్బు కేవలం మూడు రోజుల్లోనే వస్తుంది. అవును అలాంటి కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) రూ.లక్ష వరకు క్లెయిమ్‌లను పరిష్కరించే కొత్త సౌకర్యాన్ని అమలు చేస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 1 లక్ష రూపాయల వరకు మీరు క్లెయిమ్ పొందవచ్చు. పిల్లల చదువు, పిల్లల వివాహం, ఆసుపత్రి ఖర్చులు మొదలైన అవసరాల కోసం పరిమిత నిధులను ఉపసంహరించుకోవచ్చు.

పీఎఫ్ నుంచి డబ్బును ఉపసంహరించుకునే...