భారతదేశం, ఏప్రిల్ 7 -- కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ నుండి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటన ప్రకారం, పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు 2 రూపాయలు పెంచారు. దీని కారణంగా, పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ 13 రూపాయలకు, డీజిల్ పై 10 రూపాయలకు పెరిగింది.

ఈ మార్పులు 2025 ఏప్రిల్ 8వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ మార్పులు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అవసరమని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఎక్సైజ్ చట్టం, 1944 మరియు ఫైనాన్స్ చట్టం, 2002 ప్రకారం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబందించిన గతంలో ఉన్న నోటిఫికేషన్ లలో మార్పులు చేస్తూ ఈ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇది 2025 ఏప్రిల్ 8 నుండి అమలు...