భారతదేశం, మార్చి 14 -- డబ్బు అవసరాల కోసం ఇప్పుడున్న ఆప్షన్స్​లో పర్సనల్​ లోన్​ ఒకటి. కస్టమర్లను సంతృప్తి పరిచేందుకు ఆర్థిక సంస్థలు సైతం ఇన్​స్టెంట్​గా పర్సనల్​ లోన్​లు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణం, ఇంట్లో వివాహం, అత్యవసర సమయంలో, అత్యవసర పర్యటన కోసం లేదా ఉన్నత విద్యతో సహా అనేక అవసరాలకు వ్యక్తిగత రుణాన్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అయితే పర్సనల్​ లోన్​ తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే అధిక వడ్డీ రేట్ల భారమే కాదు, హిడెన్​ ఛార్జీల రూపంలో మరిన్ని కష్టాలు ఎదురవ్వొచ్చు. ఇది తెలియకపోతే మీ మీద ఆర్థిక భారం మరింత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో లోన్​కి సంబంధించిన హిడెన్​ ఛార్జీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1.ప్రాసెసింగ్ ఫీజు: బ్యాంకులు మీ పర్సనల్​ లోన్​ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ఇది రుణ మొత్తంలో 1 నుంచి 3 శాతం ...