భారతదేశం, ఆగస్టు 31 -- పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండడం చాలా ముఖ్యం. రుణదాతలు అప్పు ఇవ్వడానికి ముందు చూసే ముఖ్యమైన ప్రమాణాల్లో ఇది ఒకటి. రుణగ్రహీత ఆర్థిక విశ్వసనీయతను ఇది తెలియజేస్తుంది.

క్రెడిట్ స్కోర్​ని సిబిల్ స్కోరు అని కూడా పిలుస్తారు. ఇది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. కస్టమర్ రుణాలను తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. భారత దేశంలో ఆర్బీఐ లైసెన్స్ పొందిన నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్​ స్కోర్​ని నిర్దేశిస్తాయి. అవి.. క్రిఫ్ హై మార్క్, సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్.

మీరు మీ క్రెడిట్ స్కోరును ఆయా సంస్థల వెబ్‌సైట్లలో సులభంగా చూసుకోవచ్చు. సాధారణంగా 700 కంటే ఎక్కువ స్కోరును మంచి క్రెడిట్ స్కోరుగా, 600 కంటే తక్కువ స్కోరును తక్కువ క్రెడిట్ స్కోరుగా పరిగణిస్తారు.

మం...