భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​ అని, ప్రీ-అప్రూవ్డ్​ పర్సనల్​ లోన్​ అని.. ఇలా రోజు మీకు కాల్స్​ మీద కాల్స్​ వస్తున్నాయా? అయితే, అసలు ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​కి, ప్రీ అప్రూవ్డ్​ పర్సనల్​ లోన్​కి మధ్య వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా? ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకునే ముందు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసా? ఇక్కడ చూసేయండి..

ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​ అనేది మీరు ఎక్కువ రోజులు వేచి ఉండకుండా తక్షణమే పొందగల డబ్బు! ఒక కస్టమర్​కి సంబంధించిన ఇకేవైసీ ఇప్పటికే పూర్తయిన సందర్భాల్లో ఈ తరహా లోన్​లు చాలా సాధారణం. పాన్​తో లింక్ చేసిన మొబైల్ నెంబర్​ను షేర్​ చేసి ఆన్​లైన్ వెరిఫికేషన్ చేయించుకుంటే చాలు.

లోన్​ ఇచ్చే సంస్థ మీ మొబైల్ నెంబరును ధృవీకరించడానికి ఒక OTPని పంపుతుంది. కస్టమర్ ఆ OTPని ఎంటర్​ చేసినప్పుడు, రుణదాత అతని/ఆమె క్రెడిట్ ...