భారతదేశం, సెప్టెంబర్ 2 -- అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి పర్సనల్​ లోన్​ ఒక మంచి పరిష్కారం. కానీ వీటిలో కొన్ని హిడెన్​ ఛార్జాలు ఉంటాయి. అవి చివరికి రుణ భారాన్ని పెంచుతాయి. తెలివైన రుణగ్రహీతలు ఈ చిన్న చిన్న లోపాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఊహించని ఆర్థిక సమస్యలను నివారించవచ్చు.

ఏదైనా.. పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు, దాని నిబంధనలు, వడ్డీ రేట్లు, చెల్లింపు కాలపరిమితి, ఇతర వెసులుబాటు వంటి వివరాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

పర్సనల్​ లోన్​ ఊహించిన దానికంటే ఖర్చుతో కూడుకున్నదిగా మార్చే ఐదు ప్రధాన కారణాలు, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాము..

పర్సనల్​ లోన్​పై విధించే ప్రాసెసింగ్ ఫీజులు సాధారణంగా రుణ మొత్తంలో 0.5% నుంచి 3% వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని రుణంలో నుంచే ముందుగానే కట్ చేస్తారు. ఇలాంటి కోతలు రుణ భారాన్ని ప...