భారతదేశం, మార్చి 7 -- మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. నానికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ కేసులో ఏ6గా ఉన్నారు పేర్ని నాని. మచిలీపట్నం రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ వ్యవహారంలో.. మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నంలోని గోదాముల్లో.. రేషన్‌ బియ్యం తగ్గినట్టు అధికారులు గుర్తించారు.

గోదాము మేనేజర్ మానస్ తేజ బ్యాంక్ ఖాతాలో.. రూ.1.18 కోట్ల నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారని ఆరోపణలు వచ్చాయి. రేషన్ బియ్యం నిల్వలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు పేర్ని నాని కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

పేర్ని నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్...