భారతదేశం, మార్చి 23 -- ఆడపిల్లల పేరెంట్స్ ప్రస్తుతం తప్పక ఆలోచించాల్సిన విషయమిది. మహిళల జీవితంలో పీరియడ్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇది వయస్సుకు తగ్గట్టుగా జరిగితే ఎటువంటి సమస్యా ఉండదు. కానీ ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఆడపిల్లలకు చిన్నతనంలోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఇది చాలా సీరియస్‌గా పరిగణించాల్సిన విషయం.

స్త్రీ జీవితంలో నెలసరి రావడం మొదలైందంటే ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి కడుపు నొప్పి నుంచి తలనొప్పి వరకూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా పిల్లలకు 13 నుంచి 14 సంవత్సరాల వయస్సు మధ్యలో పీరియడ్స్ మొదలవుతాయి. కానీ ఈ మధ్య 8 నుంచి 10 ఏళ్ల మధ్యలోనే ఈ సమస్య మొదలవుతుంది. ఇది మరీ దారణం. ఎందుకంటే.. ఈ వయసులో పిల్లలకు పీరియడ్స్ సమస్యలను తట్టుకునే శక్తి ఉండదు. బ్లీడింగ్ జరు...