Hyderabad, జనవరి 29 -- రుతుచక్రం అనేది స్త్రీ శరీరంలో నెలనెలా జరిగే ప్రక్రియ. ఈ రోజుల్లో మహిళలు శారీరకంగా, మానసికంగా అలసిపోయి చాలా భావోద్వేగానికి లోనవుతారు. ఈ సమయంలో మహిళలకు ఎంతో విశ్రాంతి అవసరం. స్త్రీలు పీరియడ్స్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో భరించలేని పీరియడ్స్ నొప్పిని నియంత్రించాలంటే ముందుగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. డాక్టర్లు సూచించిన తరువాతే వాటిని తీసుకోవాలి. కానీ పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదిలా ఉంటే పైనాపిల్ తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పైనాపిల్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు పైనాపిల్ పండ్లను తినవచ్చు. ఈ పండులో ఉండే బ్రోమెలైన్ ప్రోటీన్లన...