Hyderabad, ఫిబ్రవరి 17 -- యాంటీ వాలెంటైన్స్ వీక్ లో మూడో రోజు వచ్చేసింది. ఈరోజు పెర్ఫ్యూమ్ డే. ఈ పత్యేక దినోత్సవం వెనుక ఒక ఉద్దేశం ఉంది. ప్రేమలో మోసపోయిన వారు, ప్రేమికులు లేకుండా సింగిల్ గా జీవిస్తున్న వారి కోసమే ఈ దినోత్సవం ఎన్నో అంశాలను చెబుతోంది. పెర్య్ఫూమ్ వాసన శరీరానికి తాకగానే మనలో కొన్ని ఫీలింగ్స్ కలుగుతాయి. ఇది ఆనందకరమైన జ్ఞాపకాలను ప్రేరేపించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది.

మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవడానికి అప్పుడప్పుడు మీకోసం కొన్ని పనులు చేయాలి. మీకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందించే పెర్ఫ్యూమ్ ను ఎంపిక చేసుకోండి. ఏ అత్తరు వాసన మీలో ఉల్లాసాన్ని నింపుతుందో దాన్ని ఎంపిక చేసుకుని అప్పుడప్పుడు దుస్తులపై చల్లుకోండి. మీకోసం మీరు ఇలా చేసే చిన్న చిన్న పనులు మీలో ఎంతో ఆనందాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతాయి.

ఒక వ్యక్తి జ్ఞాపకశక్తికి సువా...