భారతదేశం, మే 7 -- ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకం అటల్ పెన్షన్ పథకం. ఈ పథకంలో మీరు మీ ఎంపిక ప్రకారం పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా రూ.210 పెట్టుబడి పెడితే, పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా రూ.5 వేలు పెన్షన్ పొందుతారు. దేశంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వం ఇలాంటి పథకాలు అందిస్తుంది. అటల్ పెన్షన్ యోజన అటువంటి పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.5,000 వరకు పెన్షన్ పొందుతారు.

అటల్ పెన్షన్ యోజన 2015-16 సంవత్సరంలో ప్రారంభించారు. పదవీ విరమణ తర్వాత వ్యక్తులకు సాధారణ ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని మెుదలుపెట్టారు. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది.

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల...