భారతదేశం, మార్చి 29 -- Pension Scam : చనిపోయిన ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి 12 ఏళ్లుగా సర్వీస్ పింఛన్ రిలీజ్ అవుతోంది. ఆయన పేరు, తండ్రి పేరు ఒకేలా ఉన్న మతిస్తిమితం లేని వృద్ధుడిని చూపిస్తూ చనిపోయిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు ఘరానా మోసానికి తెరలేపారు. ఈ మేరకు 12 ఏళ్లుగా సర్వీస్ పింఛన్ కాజేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. దీంతో మతిస్తిమితం లేని వృద్ధుడికి రావాల్సిన ఆసరా పింఛన్ నిలిచిపోవడంతో అసలు విషయం కాస్త బయటపడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో వెలుగు చూడగా.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హసన్ పర్తి పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాములు, తండ్రి పేరు కొంరయ్య గతంలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేశారు. ఆ తరువ...