భారతదేశం, ఫిబ్రవరి 20 -- స్టాక్ మార్కెట్లో కేవలం కొన్నేళ్లలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన అనేక పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ఒకటి. ఈ స్టాక్ పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడులను తెచ్చి పెట్టింది. ఈ కంపెనీ షేరు ప్రస్తుత ధర రూ.1182 స్థాయిలో ఉంది. ఐదేళ్ల క్రితం ఈ స్టాక్ రూ.4 స్థాయిలో ఉండేది. అంటే కేవలం ఐదేళ్లలో ఈ షేరు 7,864.86 శాతానికి పైగా పెరిగింది.

ఇలాంటి రాబడులతో కొందరు ఇన్వెస్టర్లు 5 ఏళ్లలో బాగా రాబడి సంపాదించారని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం రూ.లక్షకు పైగా ఇన్వెస్ట్ చేసి దాన్ని అలాగే కొనసాగిస్తే.. దాని విలువ ఇప్పుడు రూ.2.56 కోట్లకు పెరిగి ఉండేది.

గురువారం నాటి ట్రేడింగ్ సెషన్లో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ షేరు దాదాపు 4 శాతం పెరిగ...