Hyderabad, మార్చి 27 -- Peddi Ram Charan Look: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 40వ పుట్టిన రోజు అయిన గురువారం (మార్చి 27) అభిమానులకు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన 16వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టడం, ఫస్ట్ లుక్ లో చరణ్ అచ్చూ పుష్పలో అల్లు అర్జున్ లాగే ఉండటంతో అభిమానులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు.

రామ్ చరణ్ తన గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత 16వ సినిమాలో బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఆర్సీ16గా పిలిచిన ఈ మూవీ టైటిల్ ను గురువారం (మార్చి 27) రిలీజ్ చేశారు. రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ మరోసారి రస్టిక్, రగ్గ్‌డ్ లుక్ లో కనిపిస్తున్న సినిమా ఇదే. అయితే అతని లుక్ అచ్చూ పుష్పలో అల్లు అర్జున్ లాగే ఉండటం అభిమానులను అయోమయానికి గురి చేస్త...