భారతదేశం, ఏప్రిల్ 7 -- గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి వచ్చి గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోకు పూర్తిగా పాజిటివ్ స్పందన దక్కింది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 6) మేకర్స్.. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఏకంగా నేషనల్ రేంజ్‍లో రికార్డు సృష్టించింది.

పెద్ది సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోకు ఒకే యూట్యూబ్ ఛానెల్‍లో 24 గంటల్లో 36.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయని మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 7) అధికారికంగా వెల్లడించింది. ఈ లెక్కతో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది. ఈ గణాంకాన్ని బట్టి ఇండియాలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న గ్లింప్స్‌గా పెద్ది వీడియోకు రికార్డు దక్కింది.

యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా గ్లింప్స్ వీడియోకు 24 గంటల్లో 36 మిలియన...