Hyderabad, ఏప్రిల్ 6 -- Ram Charan Peddi Movie Glimpse Released: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో క్రేజీ డైరెక్టర్ బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్నచిత్రం 'పెద్ది'. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగానే ఇవాళ (ఏప్రిల్ 6) శ్రీరామ నవమి సందర్భంగా తాజాగా పెద్ది గ్లింప్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. పెద్ది ఫస్ట్ షాట్ అంటూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో అదిరిపోయింది. గ్లింప్స్ ప్రారంభంలో చుట్టూ జనాలు అరుస్తూ ఉంటారు. ఆ అరుపుల మధ్యలోనుంచి రామ్ చరణ్ మాస్ అవతార్ లుక్‌లో నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు.

బ్యాక్‌గ్రౌండ్‌లో "ఒకటే పని చేసేనాకి.. ఒకేనాగా బతికేదానికేనా.. ఇంతపెద్ద బతుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయ్యాలా.. పుడతామా ఏంటీ మళ్లీ.." అని రామ్...