భారతదేశం, ఏప్రిల్ 2 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. రస్టిక్ రగెడ్ లుట్‍లో చెర్రీ అదిరిపోయారు. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రానికి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. మంచి హైప్ ఉన్న పెద్ది సినిమాకు అప్పుడే ఆడియో రైట్స్ డీల్ కూడా జరిగిపోయింది.

పెద్ది సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. రూ.25కోట్లకు ఈ మూవీ ఆడియో రైట్స్ తీసుకుంది ఆ పాపులర్ ఆడియో కంపెనీ. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఆడియో హక్కుల విషయంలో రామ్‍చరణ్ కెరీర్లో అది అత్యధిక మొత్తంగా ఉంది. గేమ్ ఛేంజర్ చిత్రం ఆడియో హక్కులను రూ.23కోట్లకు అమ్ముడయ్యాయ...