భారతదేశం, మార్చి 3 -- Peddapalli News : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంతలో పట్టుతప్పటంతో పై నుంచి జారీ పడి మృతి చెందాడు. హనుమాన్ నగర్ కు చెందిన యువకుడు యతిరాజ్ చంద్రశేఖర్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా సృష్టించాడు.

మద్యం షాప్ దగ్గర తనతో కొందరు దురుసుగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పై నుంచి దుకుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు ఎంత నచ్చచెప్పిన వినలేదు. అంతలోనే పట్టు జారి కింద పడిపోయి త్రీవంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు, స్థానికుల సహాయంతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ...