భారతదేశం, మార్చి 28 -- Peddapalli Murder: పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో పూరెల్ల సాయికుమార్ గౌడ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

పెద్దపల్లి జిల్లాలో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటున్న యువకుడిపై యువతి తండ్రి గొడ్డలితో దాడి చేయడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణమని బంధువులు చెబుతున్నారు.

ముప్పిరితోట గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించిన సాయికుమార్ ప్రేమించాడు. వారి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువతి తండ్రి సాయికుమార్‌ను పలుమార్లు హెచ్చరించాడు. సాయికుమార్ బర్త్ డే సందర్భంగా రాత్రి మిత్రులతో వేడుకలకు సిద్దమైన సమయంలో మాటు వేసిన అమ్మాయి తండ్రి గొడ్డలితో దాడి చేశాడు.

తీవ్ర గాయాలపాలైన సాయికుమార్‌ను స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చిక...